Brahmamudi : అతడిని చూసి దుగ్గిరాల కుటుంబం షాక్.. గతం గుర్తుచేస్తారా!
on Apr 9, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -690 లో....నువ్వు ఎలా పీటలపై ఒక్కదానివే కూర్చుంటావని కావ్యతో రుద్రాణి అనగానే మా ఆయన వస్తారు నా పక్కన కూర్చుంటారని కావ్య వెళ్లి రాజ్ ఫోటో తీసుకొని వస్తుంది. ఆ ఫోటో తన పక్కన పెట్టుకొని పీఠలపై కూర్చుంటుంది. ఇదెక్కడైనా ఉందా అని రుద్రాణి దీర్ఘాలు తీస్తుంటే కల్మషం లేని మనసు ఉంటే చాలు అదంతా ఎందుకని పూజారి అంటాడు.
మరొకవైపు అదే గుడికి రాజ్, యామిని ఇంకా తన కుటుంబం వస్తుంది. ముందు వస్తే సీతారాముల కళ్యాణం దగ్గరుండి చూసేవాళ్ళమని యామిని అంటుంటే.. ఎప్పుడు అలా ఎందుకు ఆలోచిస్తావ్.. ఇక్కడ కూర్చొని చూద్దామని రాజ్ అంటాడు. యామిని పక్కన ఉంటే కళావతితో మాట్లాడలేను. అందుకే ఇప్పుడే మాట్లాడాలని ఫోన్ మాట్లాడి వస్తానంటూ పక్కకి వెళ్తాడు. అలా రాజ్ నడుచుకుంటూ వెళ్తుంటే రాజ్ ని ప్రకాశ్ చూస్తాడు. నిజం గానే రాజ్ బ్రతికివున్నాడు అంటే కావ్య చెప్పింది నిజమే.. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పాలని ప్రకాశ్ వస్తుంటే ఒకతనికి డాష్ ఇస్తాడు. అతను గొడవ పడతాడు అప్పడే ధాన్యలక్ష్మి వస్తుంది. ఒక అర్జెంట్ విషయం చెప్పాలని వస్తున్నా మర్చిపోయానని ప్రకాశ్ అంటాడు. ఆ తర్వాత కావ్యకి రాజ్ ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఇక్కడ ఫోన్ లో ఒకటే సౌండ్ వస్తుందని రాజ్ అంటాడు. నేను పూజలో ఉన్నానని కావ్య ఫోన్ కట్ చేస్తుంది.

రాజ్ లోపలికి వస్తాడు. రాజ్ ని కావ్య చూస్తుంది. ఈయన ఇక్కడికి వచ్చాడేంటనుకుంటుంది. రుద్రాణి రాజ్ ని చూస్తుంది. చూసి షాక్ అవుతుంది. నిజంగానే రాజ్ బ్రతికి ఉన్నాడు అందుకే కావ్య అంత స్ట్రాంగ్ గా చెప్పిందని రుద్రాణి అనుకుటుంది. పూజ దగ్గరికి వెళ్లి మైక్ తీసుకొని ఇంట్లో వాళ్ళకి గుడ్ న్యూస్ రాజ్ బ్రతికే ఉన్నాడు.. అదిగో అక్కడే ఉన్నాడని రుద్రాణి చెప్పాగానే.. అందరు రాజ్ దగ్గరికి వెళ్తారు. అపర్ణ వెళ్లి.. రాజ్ నువ్వు బ్రతికే ఉన్నావా అని ఎమోషనల్ అవుతుంటే.. ఎవరు మీరంతా అని రాజ్ అడిగేసరికి అందరు షాక్ అవుతారు. అందరు కలిసి రాజ్ ని తీసుకొనిపోయేలా ఉన్నారు.. ఎలాగైనా మ్యానేజ్ చెయ్యాలని యామిని అనుకుటుంది. తను నా బావ అని యామిని అంటుంది. తరువాయి భాగంలో రాజ్ గతం మర్చిపోయిన విషయం కావ్య చెప్తుంది. ఇప్పుడు రాజ్ కి గతం గుర్తు రావాలంటూ అందరు రాజ్ చుట్టూ చేరి మాట్లాడుతుంటే.. రాజ్ కి కళ్ళు తిరుగుతాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



